: మా ఆయన అస్సలేమనుకోడు...అలా అనుకుంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు: రాధికా ఆప్టే
తన వృత్తి గురించి తన భర్త తప్పుగా అనుకోడని 'లెజెండ్' భామ రాధికా ఆప్టే తెలిపింది. 'లయన్' సినిమా పాట షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ, తన భర్త తన గురించో లేక తన వృత్తి గురించో తప్పుగా అనుకుంటే పెళ్లి చేసుకునేవాళ్లం కాదని చెప్పింది. తన భర్త లండన్ లో మ్యూజిషియన్ అని, ఆయన అక్కడే పని చేస్తారని చెప్పింది. తాము పెళ్లికి ముందే కలిసి ఉన్నామని, వీసా ప్రాబ్లెం గుర్తించి పెళ్లి చేసుకుంటే సరిపోతుందని భావించి పెళ్లి చేసుకున్నామని చెప్పింది. 'తనకు నచ్చిన పని తను చేస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పనో, నాకు నచ్చిన పని చేసినప్పుడు కూడా ఆయన అభ్యంతరం చెప్పడని' రాధికా ఆప్టే వెల్లడించింది. తాజాగా సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోల గురించి తమ కుటుంబం మొత్తం నవ్వుకుందని తెలిపింది. ఆ ఫోటోలు తనవి కానప్పుడు, తానంటే ఏంటో తెలిసిన వాళ్లు అభ్యంతరం చెప్పనప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఎవరో ఏదో చేశారని హంగామా చేయడం ఇష్టం లేదని రాధికా ఆప్టే స్పష్టం చేసింది. పని లేని వాళ్లు చేసే పనులను పని చేసుకునేవాళ్లు ప్రోత్సహించకూడదని రాధిక సూచించింది.