: తొలి ప్రాధాన్యం బాలీవుడ్...ఇతర భాషల్లో హీరోల ఇమేజ్ భయపెడుతుంది: రాధికా ఆప్టే
తొలి ప్రాధాన్యం బాలీవుడ్ కేనని 'లెజెండ్' హీరోయిన్ రాధికా ఆప్టే స్పష్టం చేసింది. లయన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రాధిక తనకు బాలీవుడ్, మరాఠీ, బెంగాలీ భాషలు వచ్చు కనుక, ఆయా భాషల్లో నటిస్తే సౌకర్యంగా ఉంటుందని చెప్పింది. అలాగే భారత్ లో హీరోకు ప్రత్యేక ఇమేజ్ ఉంటుందని, ఆ ఇమేజ్ ను చూస్తే భయమేస్తుందని చెప్పింది. అభిమానులు హీరోలకు బ్రహ్మరథం పడతారని చెప్పింది. తన వరకు తెలుగు సినిమాలు అదనపు అవకాశాలేనని, అంతే కానీ తెలుగు సినిమాలే అన్నీ కాదని స్పష్టం చేసింది. అవకాశం వచ్చినప్పుడు తనకు నచ్చినవి మాత్రమే ఎంచుకుంటానని తెలిపింది. అలాగే తనకు ఎవరో ఒక డ్రీమ్ యాక్టర్ లేడని, అవకాశం ఉంటే అందరితో నటిస్తానని చెప్పింది. బాలీవుడ్ లో తను నటించిన బదలాపూర్ సినిమా విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపింది. తనకు కలెక్టర్ అవ్వాలని ఉండేదని, సినీ హీరోయిన్ అవ్వడం వల్ల ఆనందంగా ఉందని రాధికా ఆప్టే వెల్లడించింది.