: క్వార్టర్స్ చేరిన నాలుగు ఉపఖండం జట్లు
వరల్డ్ కప్ లో లీగ్ దశ పోటీలు ముగిశాయి. దీంతో వరల్డ్ కప్ రెండో దశ పోటీలు క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని తారస్థాయికి తీసుకెళ్తున్నాయి. క్వార్టర్స్ లో ఇంగ్లండ్, జింబాబ్వే మినహా మిగిలిన జట్లన్నీ క్రీడాభిమానుల అంచనాలను నిజం చేశాయి. క్వార్టర్స్ వరకు పెద్దగా సంచలనాలేవీ లేకుండానే పెద్ద జట్లన్నీ రెండో అంచె పోటీలకు అర్హత సంపాదించాయి. గత రెండు వరల్డ్ కప్ లలో పాల్గొన్న బంగ్లాదేశ్ క్వార్టర్స్ లో ప్రవేశించిన చిన్న జట్టుగా కనిపిస్తున్నప్పటికీ తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపించగలదు. తాజా వరల్డ్ కప్ లో భారత ఉపఖండం నుంచి వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొంటున్న జట్లన్నీ అర్హత సాధించాయి. భారత జట్టును టైటిల్ ఫేవరేట్ గా అంచనా వేస్తుండగా, శ్రీలంక అండర్ డాగ్ గా పరిగణించబడుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తమవైన రోజున ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా ఉన్నవేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.