: క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించిన పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు
నేటితో వరల్డ్ కప్ లో లీగ్ పోటీలు ముగిశాయి. మార్చి 18 నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. వరల్డ్ కప్ లో నిలకడలేని ఆటతీరుతో పాక్ క్వార్టర్స్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టులోని ఆటగాళ్లు ఫెయిలయ్యారు. పోర్టర్ ఫీల్డ్ ఒక్కడే జట్టు భారాన్ని మోస్తూ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 237 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు, 46.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. సర్ఫ్ రాజ్ అహ్మద్ సెంచరీ సాధించగా అతనికి షెహజాద్ అహ్మద్, మిస్బా సహకారం అందించడంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్ జట్టు క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. పాక్ పై ఓటమితో ఐర్లాండ్ జట్టు ఇంటి ముఖం పట్టింది. రన్ రేట్ ఐర్లాండ్ కంటే మెరుగ్గా ఉండడంతో విండీస్ జట్టు క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.