: కోల్ కతాలో దారుణం...సన్యాసిని గ్యాంగ్ రేప్... 10 లక్షలు దోపిడీ
కోల్ కతాలోని రాణాఘాట్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాన్వెంట్ స్కూల్ లోపలికి చొరబడిన నలుగురు దుండగులు 71 ఏళ్ల సన్యాసినిపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. అనంతరం స్కూలు ఆవరణలో ఉన్న ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేసి, అందులో ఉన్న 10 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, స్కూలులోని సీసీటీవీ పుటేజీని పరిశీలించి నలుగురు దొంగలను గుర్తించినట్టు తెలిపారు. దీనిని గురించి తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామాంధులను వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.