: వైద్యులు, నర్సులు టీచర్లలా అవగాహన కల్పించాలి: అబ్దుల్ కలాం
వైద్యులు, నర్సులు ఉపాధ్యాయుల్లా ఆరోగ్యపెంపుదల ఆవశ్యకతను వివరించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గుంటూరులో రమేష్ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధుల నివారణకు ప్రాథమిక మార్గం రెగ్యులర్ చెకప్స్ అన్నారు. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు జీవన వ్యవహారశైలిలో చిన్న మార్పుల ద్వారా పెను ముప్పులను ఎదుర్కోవచ్చని ఆయన సూచించారు. వ్యాయామంపై అవగాహన పెంచుకుని అనుసరిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన సూచించారు. మంచినీటి వాడకంపై ప్రజలకు అవగాహన పెంచాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వైద్యులు, నర్సులు ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన అలవాట్లపై అవగాహన పెంచాలని ఆయన సూచించారు.