: పాకిస్తాన్ లో ఉగ్రదాడి... ప్రార్థనా మందిరాల్లో పేలిన బాంబులు
ఉగ్రవాదుల దాడులతో పాకిస్తాన్ మరోసారి భీతిల్లింది. ముఖ్య పట్టణం లాహోర్ పరిధిలోని యొహానాబాద్ లో ఉన్న రెండు ప్రార్థనా మందిరాల్లో ఉగ్రవాదులు బాంబు దాడులతో తెగబడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు సంభవించగా, నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 40మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.