: ఏప్రిల్‌ 3న సురేష్ రైనా పెళ్లి!... చిన్ననాటి స్నేహితురాలితో ఏడడుగులు


భారత క్రికెట్ జట్టులో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ గా ఉన్న సురేష్ రైనా ప్రస్తుత వరల్డ్ కప్ పోటీలు ముగిసిన వెంటనే పెళ్లి చేసుకోనున్నాడని తెలుస్తోంది. రైనా తన చిన్ననాటి స్నేహితురాలితో ఏడడుగులు నడవనున్నట్టు సమాచారం! ఏప్రిల్‌ 3న వివాహ వేడుక ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. వధువు రైనా తల్లికి స్నేహితురాలి కుమార్తెగా తెలిసింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమై రైనా బిజీ కాకముందే పెళ్లి చేసేయాలని వారు ఆత్రుతగా ఉన్నారని తెలుస్తోంది. మన రైనా ఇక భర్తగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడన్నమాట!

  • Loading...

More Telugu News