: తిరుపతి పోలీస్ స్టేషనులో మహిళ ఆత్మహత్యాయత్నం
భర్త రెండో పెళ్లి చేసుకుని తనను ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ రెండు రోజులుగా తిరుపతిలో భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న రాధిక అనే మహిళ తిరుపతి మహిళా పోలీస్ స్టేషనులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయంలో మహిళా సంఘాలు, ఆ ప్రాంత ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఇరు వర్గాలకు వత్తాసు పలుకుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు భర్తను జైలుకు తరలించారు. పోలీసులు న్యాయం చేయడంలేదన్న మనస్తాపంతో స్టేషనులో రాధిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు వెంటనే ఆమెను రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదుపై స్పందించగలమే తప్ప భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోలేమని పోలీసులు తేల్చి చెప్పారు. రెండో భార్యకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని ఆ ప్రాంత ప్రజలు నిరసనలకు దిగారు. ఆ ప్రబుద్ధుడు మాత్రం తనకు మొదటి పెళ్లి జరగలేదని, రాధిక బిడ్డ తన బిడ్డ కాదని వాదిస్తున్నాడు.