: తుళ్ళూరుతో గుంటూరు, విజయవాడలు కలుపుతూ అంతర్జాతీయ స్థాయి రాజధాని: వెంకయ్య


ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్ళూరుతోపాటు చుట్టుపక్కల నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ రాజధాని ఏర్పాటవుతుందని, ఈ మేరకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. నేటి ఉదయం గుంటూరులో రమేష్ కార్డియాలజి ఆసుపత్రిని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాలలో మంచి నీరు, మురుగునీటి పారుదల నిమిత్తం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆసుపత్రుల నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News