: కలెక్టర్ మరీ ఘోరంగా తిడుతున్నారు... వాపోయిన కృష్ణా జిల్లా అధికారులు


కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు తమను తిడుతున్నారని, కట్టు బానిసలుగా చూస్తున్నారని పలువురు అధికారులు వాపోయారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరుగగా, ఇందులో పాల్గొన్న అధికారులు బాబు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఆయన యూజ్‌ లెస్, వేస్ట్‌ ఫెలో, ఇంటికిపో, బయటకు పో అంటూ పదేపదే దుర్భాషలాడుతున్నారని వారు ఆరోపించారు. తన తీరును మార్చుకోకుంటే ఆయనకు సహకరించేది లేదని సమావేశంలో తీర్మానించారు. గెజిటెడ్ అధికారులను సైతం ఆయన అటెండర్‌ల కంటే హీనంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తరువాత వీడియో కాన్ఫరెన్స్‌ లు, సెల్ కాన్ఫరెన్స్‌ లు పెడుతున్నారని, వీటికి హాజరు కాకూడదని తీర్మానించారు.

  • Loading...

More Telugu News