: మేరికోమ్ కు మరో అరుదైన గౌరవం
ఒలంపిక్ బాక్సర్ ఛాంపియన్ మేరీకోమ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ ఉదయం వెల్లడించారు. డెవలప్ మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (డోనర్) నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం కోసం మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో వేసిన కమిటీ మేరీకోమ్ ను ఎంపిక చేసిందని డోనర్ వర్గాలు తెలిపాయి. అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వివరించాయి. కాగా, రియో డిజనీరోలో జరగనున్న ఒలంపిక్ గేమ్స్ తదుపరి బాక్సింగ్ నుంచి రిటైర్ మెంట్ తీసుకోనున్నట్లు మేరీకోమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.