: రాజధాని రైతులు భూములు ఖాళీ చేయాల్సిందే ... స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
ఏప్రిల్ 15లోగా ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ భూములను ఖాళీ చేయాలని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. రైతులు తమ భూములను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే, రాజధాని నిర్మాణానికి సంబంధించి సన్నాహలు చేసుకుంటామని ఆయన అన్నారు.ఇంతవరకు 1100 మందికి చెక్కులు పంపిణీ చేశామని, మిగిలినవారి వివరాలు తీసుకుని, పరిశీలించి చెక్కులు ఇస్తామని ఆయన వివరించారు. ఈ నెలాఖరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సింగపూర్ వెళ్లి మాస్టర్ ప్లాన్ ను పరిశీలిస్తామని నారాయణ తెలిపారు. రైతులకు భూములు వదలుకోవడం ఒక రకంగా గుండె పిండినట్లే ఉంటుందని, కానీ భవిష్యత్ కోసం తప్పదని అన్నారు.