: తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తన్న డిమాండ్


తెలంగాణ ప్రాజెక్టులపై వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రాజెక్టులపై తెరాస అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, వాటిని 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిందని, ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టు కూడా కాలేదని ఆయన ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయహోదా కల్పించే అంశంపై సీఎం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రానికి సోలార్ ప్లాంట్ మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన, 2,500 ఎకరాలు చూపిస్తే 500 మెగావాట్ల ప్లాంటును కేంద్రం మంజూరు చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News