: సెంచరీ దిశగా పోర్టర్‌ ఫీల్డ్... నిదానంగా సాగుతున్న ఐర్లాండ్


పాకిస్తాన్ తో జరుగుతున్న క్రికెట్ పోరులో ఐర్లాండ్ జట్టు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఓపెనర్ పోర్టర్‌ ఫీల్డ్ తనదైన శైలిలో ఆడుతూ సెంచరీకి చేరువ అయ్యాడు. 30 ఓవర్లు ముగిసే వరకు ఐర్లాండ్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో పోర్టర్‌ ఫీల్డ్ 84 పరుగులు చేశాడు. పోర్టర్‌ కు మరెవరూ అండగా నిలవలేక పోయారు. స్టిర్లింగ్ 3, జాయ్ సీ 11, ఓబ్రియాన్ 12, బాల్ బిర్నీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు వెస్టిండీస్ తో పాటు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత పొందుతారు.

  • Loading...

More Telugu News