: సున్నిపెంటలో విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణకు ఆదేశాలు


కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గిరిజన హాస్టల్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ముఖ్య కార్యదర్శిని ఆదేశించామని, పరీక్షల సమయంలో మనోధైర్యాన్ని వారిలో పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. కాగా, గిరిజన సంక్షేమ హాస్టల్ లోని ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్ లు ఇంటర్ పరీక్షల్లో డిబార్ కాగా, మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీరు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

  • Loading...

More Telugu News