: పాక్, ఐర్లాండ్ మ్యాచ్ కి వరుణుడు అడ్డురాకుంటే... క్వార్టర్ ఫైనల్స్ లో విండీస్... యూఏఈపై ఘన విజయం
నెపియర్ లో యూఏఈతో జరుగుతున్న పోరులో వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది. గ్రూప్ -బి నుంచి క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం పొందే దిశగా నిర్ణీత 176 పరుగుల విజయ లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో చేరుకుంది. పాకిస్తాన్, ఐర్లాండ్ జట్ల కన్నా మెరుగైన రన్ రేట్ రావాలంటే 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరాల్సిన విండీస్ మరింత మెరుగైన స్థితికి చేరింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కార్టర్ అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయానికి బాటలు వేశారు. కాగా, ఇంకా విండీస్ నాకౌట్ అవకాశాలు గ్యారెంటీ అని చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ పాక్, ఐర్లాండ్ మ్యాచ్ కి వరుణుడు అడ్డుపడితే, రెండు జట్లూ చెరో పాయింట్ తో విండీస్ ను ఇంటికి పంపి క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటాయి.