: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ బిలో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు మరికాసేపట్లో పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో ఐర్లాండ్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే రన్ రేట్ కీలకం కానుంది. పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇంతే. గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్ లో చోటు గ్యారెంటీ. ఓడితే, విండీస్ కన్నా మెరుగైన రన్ రేటును కలిగి ఉండాల్సి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే ఐర్లాండ్, పాక్ జట్లు నాకౌట్ కు అర్హత సాధిస్తాయి.