: పెండింగ్ బిల్లుల కోసం ఓవర్ టైం గడపనున్న ఎంపీలు!
పెండింగ్ లో వున్న కీలక బిల్లుల ఆమోదం కోసం రాత్రి ఏడు గంటల తరువాత కూడా సమావేశం కావాలని రాజ్యసభ నిర్ణయించింది. రేపటి నుంచి వచ్చేవారం రాత్రి ఏడు గంటల తర్వాత కూడా రాజ్యసభ కొనసాగనుంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు వచ్చేవారంతో ముగియనున్న నేపథ్యంలో బిల్లుల ఆమోదంకోసం ఓవర్ టైం సభలో ఉండి చర్చలు జరపాలని సభా కార్యకలాపాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. కాగా, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేక పోవడంతో బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వాడీవేడీ చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు.