: ఓటేయండి బాబూ... పొద్దున్నే పార్కుల వెంటపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్


ఎంఎల్సీ ఎన్నికల్లో ప్రచారానికి తెల్లవారుజాముకన్నా మంచి సమయం దొరకదని అనుకున్నారో ఏమో, టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన అభ్యర్థి దేవీప్రసాద్ హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ వద్ద ఈ ఉదయం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తనకు ఓటేయాలని వాకర్లను ఆయన అభ్యర్థించారు. ఆయన అనుచరులు సైతం పొద్దున్నే వీధుల్లోకి వచ్చి మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని ఓట్లేయాలని కోరారు. దేవీప్రసాద్ తో పాటు టీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఇన్‌ ఛార్జి సతీష్‌ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాయర్ల జేఏసీ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టారు.

  • Loading...

More Telugu News