: రాహుల్ ఇంటితో పాటు... కేసీఆర్ ఇంట్లో కూడా పోలీసుల విచారణ


రాహుల్ గాంధీ ఇంట్లో సిబ్బందిని పోలీసులు విచారణ పేరిట అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసిన రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సీ స్పష్టం చేశారు. నేతల ఇళ్లకు పోలీసులు వెళ్ళడం నిఘా కోసం కాదని, యథాలాపంగా జరిగిందని తెలిపారు. ఆయనతో పాటు మాజీ మంత్రి వీరప్ప మొయిలీ, భాజపా అగ్రనేత ఎల్.కె. అద్వానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తదితరుల నివాసాలకూ వెళ్ళారని వివరించారు. ఆయన ఇంటికి వెళ్ళాలని ప్రధాని నుంచి గానీ, హోం మంత్రి నుంచి గానీ ఎలాంటి ఆదేశాలూ రాలేదనీ, తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని తేల్చిచెప్పారు. ప్రత్యేక బలగాల రక్షణలో ఉన్న ముఖ్యుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేసి సేకరిస్తూ ఉంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News