: 46 పరుగులకు 6 వికెట్లు... వెస్టిండీస్ కు కొరుకుడు పడని జావేద్, అజీజ్


వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేపియర్ లో వెస్టిండీస్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో 46 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయిన యూఏఈ ఆపై నెమ్మదిగా కోలుకుంటోంది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌ మెన్లు అంజాద్ జావెద్, అజీజ్‌ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ, స్కోర్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు విండీస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం జావీద్ 52, అజీజ్ 59 పరుగులతో ఆడుతున్నారు. యూఏఈ స్కోర్ 39 ఓవర్లలో 152/6.

  • Loading...

More Telugu News