: భయపెట్టేలా ఉండకూడదు: పవన్ కల్యాణ్


నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అన్నది సామాన్యుడిని భాగస్వామిని చేసేలా ఉండాలి తప్ప, భయపెట్టేలా ఉండకూడదని హితవు పలికారు. అప్పటి హీరాకుడ్ నుంచి ఇప్పటి పోలవరం దాకా ప్రాజెక్టుల వల్ల సామాన్యులు, ఆదివాసీలు నిర్వాసితులుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు ప్రారంభించడంలో చూపే ఉత్సాహం పునరావాసం కల్పించడంలో చూపడం లేదని నిశితంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఓ నిర్వాసితుడి ఆవేదనను తన ట్విట్టర్ అకౌంట్ లో పొందుపరిచారు. ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశామని, కానీ రోడ్ల కోసం ఊళ్లను తొలగించడం చూడలేదని రింగురోడ్డు కారణంగా తన స్థలాన్ని కోల్పోయిన ఓ వ్యక్తి అన్న మాటలను గుర్తు చేశారు. ఇక, జనసేన పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు, అభిమానులకు అక్కాచెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. చివర్లో, "మానవీయకోణంతో కూడిన అభివృద్ధే జనసేన ఆకాంక్ష, జైహింద్" అంటూ ముగించారు.

  • Loading...

More Telugu News