: షెడ్యూల్ పై ధోనీ అసంతృప్తి
వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచ్ లను న్యూజిలాండ్ గడ్డపై ఆడింది. అయితే, తొలి నాలుగు మ్యాచ్ లను ఆసీస్ గడ్డపై ఆడిన భారత్ ఆటగాళ్లు ఆయా దేశాల కాలమాన పరిస్థితులకు అలవాటు పడలేక నానా ఇబ్బందులకు గురయ్యారట. దీనిపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ, న్యూజిలాండ్ లో మ్యాచ్ లు నిర్వహించిన సందర్భంగా ఆటగాళ్లు మారిన సమయాలకు అనుగుణంగా సర్దుకోలేక అస్వస్థతకు గురయ్యారని తెలిపాడు. పెర్త్ సమయం మెల్బోర్న్ సమయం కంటే నాలుగున్నర గంటలు వెనుకబడి ఉండగా, ఆక్లాండ్ సమయం మెల్బోర్న్ కంటే రెండున్నర గంటలు ముందుంటుంది. దీంతో, ఈ సమయాలకు తగిన విధంగా సర్దుకోలేక, నిద్ర కరవై ఆటగాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారని ధోనీ వివరించాడు. మార్చి 19న బంగ్లాదేశ్ తో జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆడేందుకు టీమిండియా ఇప్పుడు మెల్బోర్న్ వెళ్లాల్సి ఉంది.