: ప్లీజ్! చాన్సివ్వండి... చంద్రబాబును కలిసిన సోమిరెడ్డి, నన్నపనేని
ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. దీంతో, పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఏపీ టీడీపీ నేతలు అధినేత చంద్రబాబును కోరుతున్నారు. తాజాగా, శనివారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, లింగారెడ్డి, మంతెన, బీద రవిచంద్రయాదవ్, ఫరూఖ్, షరీఫ్ తదితరులు చంద్రబాబును కలిసి టికెట్ అర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ ఆశావహుల జాబితాలో ఉన్నారట. ఎవరి మార్గంలో వారు టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.