: అమెరికాలో భారత విద్యార్థి రిషవ్ చౌదరి దుర్మరణం


రిషవ్ చౌదరి అనే భారత విద్యార్థి అమెరికాలో పర్వతారోహణ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయి ప్రాణాలు విడిచాడు. ఆరిజోనాలోని కోకోనినో అడవుల్లో ఉన్న వెస్ట్ క్లియర్ క్రీక్ పర్వాతాన్ని అధిరోహించే క్రమంలో ఓ లోయలో 100 మీటర్ల దిగువకు పడిపోయాడు. తీవ్రగాయాలవడంతో మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు. వూస్టర్ ఆర్ట్స్ కళాశాలలో రిషవ్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. రిషవ్ స్వస్థలం అసోంలోని గౌహతి. అతని మరణవార్తను కళాశాల డీన్ కర్ట్ హోమ్స్ ప్రకటించారు. రిషవ్ లేడన్న వార్తతో తమ గుండె పగిలిపోయిందని, అతని కుటుంబానికి, మిత్రులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News