: భర్తపై కేసు పెట్టిన అలనాటి అందాలతార
కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించిన అలనాటి బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి తన భర్తపై ముంబయిలోని వర్లి పోలీస్ స్టేషన్ లో గృహహింస ఫిర్యాదు దాఖలు చేసింది. భర్త అనిల్ విరావని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 1985లో వ్యాపారవేత్త అనిల్ ను ఆమె వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కుమారుడున్నాడు. తెలుగులో రతి అగ్నిహోత్రి పున్నమినాగు, భోగి మంటలు, తిరుగులేని మనిషి, జీవితరథం, కలియుగ రాముడు, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర తదితర చిత్రాల్లో నటించింది.