: రూ.1000ల మెంబర్ షిప్ తో ఆ థియేటర్లో ఏడాదిపాటు సినిమాలు ఫ్రీ
ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఓ సినిమా థియేటర్ సరికొత్త ప్లాన్ వేసింది. తమిళనాడులోని తూత్తుకుడి ఏరియాలో షణ్ముగ అనే సినిమా థియేటర్ ఉంది. ప్రేక్షకులను బాగా రాబట్టేందుకు దాని యజమాని ఆనంద్ ఓ వినూత్న ఆలోచనను అమల్లోపెట్టాడు. రూ.1000 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఓ ఏడాదిపాటు సినిమాలు ఫ్రీ అని ప్రకటించాడు. మెంబర్లకు వీలుకాకపోతే, తామిచ్చే రసీదును చూపించి వారి బదులు ఎవరైనా థియేటర్లోకి రావచ్చని ఆనంద్ వివరించాడు. అంతేగాదు, ఆ మెంబర్ షిప్ ఉన్న వ్యక్తులు థియేటర్ కాంప్లెక్స్ లో ఉన్న మాల్ లో 5 శాతం డిస్కౌంట్ తో షాపింగ్ కూడా చేయొచ్చట. దీంతో, ఇప్పుడీ థియేటర్ కు ప్రజలు భారీగా తరలి వస్తున్నారట.