: అధికారంలో ఉన్నంత మాత్రాన పోలీసులను ప్రయోగిస్తారా?: కాంగ్రెస్ మండిపాటు
ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసానికెళ్లి పోలీసులు ఎంక్వైరీ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. అధికారంలో ఉన్నాం కదా అని పోలీసులను ప్రయోగించడం సరికాదని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ బీజేపీకి హితవు పలికారు. ఇలాంటివి గుజరాత్ తరహా విధానాలు అవచ్చొమోగానీ, భారత్ విధానాలు మాత్రం కావని అన్నారు. రాహల్ నివాసానికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు ఓ ప్రశ్నావళిని పూరించుకుని వచ్చేందుకు ప్రయత్నించడం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఎఎస్సై రాహుల్ నివాసానికి వెళ్లి... ఆయన ఏ రంగులో ఉంటారు? జుట్టు రంగేమిటి? ఎత్తు ఎంత? విచారణ చేసినట్టు తమకు తెలిసిందని సింఘ్వీ అన్నారు. ఈ ప్రయత్నం గూఢచర్యం లాంటిదేనని సింఘ్వీ ఆరోపించారు. పోలీసులు మాత్రం ఇది సాధారణ వ్యవహారమేనని అంటున్నారు.