: బయటికెళ్లి వ్యాయాయం చేద్దామని చెప్పడమే నా ఉద్దేశం: మిసెస్ ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా సామాజిక స్పృహ మెండుగా ఉన్న వ్యక్తి. ప్రజాహిత కార్యక్రమాల్లో ఆమె స్వచ్ఛందంగానే పాల్గొంటారు. తాజాగా, ది ఎలెన్ డీజనరస్ టీవీ షో లో డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. తాను ప్రారంభించిన 'లెట్స్ మూవ్' అనే ప్రచార కార్యక్రమం ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిషెల్ ఈ ప్రజాదరణ పొందిన షోలో పాల్గొన్నారు. బ్రూనో మార్స్ ఆలపించిన 'అప్ టౌన్ ఫంక్' అనే గీతానికి పలువురితో కలిసి ఆమె నర్తించారు. ఎప్పుడూ కంప్యూటర్లు, టెలివిజన్ సెట్ల ముందు కూర్చునే బదులు, కాసేపలా బయట ఎక్సర్ సైజులు చేద్దామని చెప్పేందుకే తాను లెట్స్ మూవ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించానని మిషెల్ ఈ సందర్భంగా వివరించారు.

  • Loading...

More Telugu News