: నేను ఏపీ ఎంపీని, కేంద్రానికి పరిస్థితులన్నీ వివరిస్తున్నా: నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తాను ఏపీ ఎంపీనని, కేంద్రానికి పరిస్థితులన్నీ వివరిస్తున్నానని అన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. చట్టంలోని వాగ్దానాల్నింటినీ కేంద్రం నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చేందుకు గట్టి కృషి చేస్తున్నామన్నారు. కేంద్రానికి రాష్ట్రాలన్నీ సమానమేనన్న మంత్రి, అదే విధంగా తెలంగాణ విషయంలోనూ స్పందించానని తెలిపారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కేంద్రం 42 శాతం పన్నువాటాను రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించేందుకు కూడా గట్టి కృషి చేస్తున్నామన్నారు.