: తలసాని ఓ సన్నాసి... సనత్ నగర్ లో పోటీచేసే దమ్ములేదు: రేవంత్ రెడ్డి
టీ.టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయి మంత్రి పదవి దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తలసాని ఓ సన్నాసి అని వ్యాఖ్యానించారు. సనత్ నగర్ లో పోటీచేసే దమ్ము, ధైర్యం ఆయనకు లేవని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ బ్లాక్ మెయిలింగ్ కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమార్తె కవిత పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా సర్పంచ్ ల జీతాలు మరోసారి పెరగడం సంతోషంగా ఉందని మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. వారం రోజుల కిందట ప్రెస్ క్లబ్ లో సర్పంచ్ ల జీతాలపైన, సమస్యల పరిష్కారానికి సదస్సు జరిగిందని, సర్పంచ్ ల జీతభత్యాలపై అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతారని తాను వారం కిందటే చెప్పానని రేవంత్ గుర్తు చేశారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.