: కోడిపుంజు అవతారమెత్తిన గుత్తా జ్వాల


హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కోడిపుంజు అవతారంలో సందడి చేశారు. ఇదంతా కూడా 'పెటా' కోసమేనట. జంతువుల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసే సంస్థగా పెటాకు పేరుంది. ఈ సంస్థకు ఎందరో ప్రముఖులు స్వచ్ఛంద ప్రచారకర్తలుగా ఉన్నారు. వారిలో జ్వాల కూడా ఒకరు. తాజాగా, హైదరాబాదులో నిర్వహించిన పెటా ప్రచారంలో జ్వాల కోడిపందాలు వద్దంటూ ప్రచారం చేశారు. పందాల పేరిట కోడి పుంజులను హింసించరాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ జంతు హింసను నివారించేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కోడి పందాలు మనకు వినోదాన్ని ఇచ్చేవి కావని, బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలు, సినిమాలు వీక్షించడం, ఫ్రెండ్స్ ను కలవడం ద్వారా వినోదం పొందాలేగానీ, కోడిపందాలతో వినోదాన్ని పొందాలనుకోవడం సరికాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News