: కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలపై వ్యాజ్యం


ఏపీలో అధికారికంగా శ్రీరామనవమి వేడుకలను కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి దేవాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. నవమి ఉత్సవాలను విజయనగరం జిల్లాలో నిర్వహించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఒంటిమిట్టలో నవమి వేడుకలు నిర్వహించడం ప్రభుత్వానికి మంచిది కాదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిల్ పై కోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఒంటిమిట్టలో నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండటంతో గత్యంతరం లేకే న్యాయస్ధానాన్ని ఆశ్రయించామని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానందయోగి తెలిపారు.

  • Loading...

More Telugu News