: ఆలంను విడుదల చేయడంతో తప్పేముంది?: జమ్మూకాశ్మీర్ సీఎం కుమార్తె
జమ్మూకాశ్మీర్ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వేర్పాటు వాది మసరత్ ఆలం విడుదల అంశంపై స్పందించారు. ఆలంను విడుదల చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆయనకు ముఫ్తీ మహ్మద్ సయీద్ సర్కారు స్వేచ్ఛ ప్రసాదించడంపై తానేమీ చింతించడం లేదని అన్నారు. తామేమీ తప్పు చేయలేదని, సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించామని వివరించారు. ఇండియా టుడే మీడియా సంస్థ ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.