: హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధమే: సదానంద గౌడ
తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు వస్తే వారంలోగా విభజన చేయవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు సదానంద హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పైవిధంగా స్పందించారు. మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సమయంలో మాట్లాడుతూ, రానున్న 15 రోజుల్లో హైకోర్టు విభజన జరగనున్నదని తెలిపారు. ఇదిలా ఉంటే, తెలంగాణ న్యాయవాదులు ఈరోజు మంత్రి సదానందను కలసి హైకోర్టు విభజనకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.