: సోనియా దయతోనే తెలంగాణ ఏర్పడింది... నా తర్వాతే విద్యార్థులు ఉద్యమం చేశారు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ముమ్మాటికీ సోనియాగాంధీనే అని... ఆమె దయతోనే రాష్ట్రం ఏర్పడిందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడిన కేసీఆర్... విభజన గురించి కూడా మాట్లాడారు. తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా, అందులో సోనియాగాంధీ పాత్రను విస్మరించలేరని అన్నారు. మరి ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది ఎవరో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి కదా? అని అడిగారు. దీంతో, "కేసీఆర్, టీఆర్ఎస్" అంటూ ఆ పార్టీ సభ్యులు గట్టిగా అరవగా... "చెప్పాల్సింది మీరు కాదు... పెద్దలు డి.శ్రీనివాస్" అని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. తాను ఉద్యమం చేపట్టిన తర్వాతే విద్యార్థులు కూడా ఉద్యమంలోకి వచ్చారని కూడా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News