: జాఫ్నాలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం జాఫ్నాలో అడుగుపెట్టారు. శ్రీలంకలోని ఆధ్యాత్మిక పట్టణం అనురాధపురను సందర్శించిన తర్వాత మోదీ భారత వాయుసేన హెలికాప్టర్లో జాఫ్నా చేరుకున్నారు. ఎల్టీటీఈ, లంక దళాల మధ్య పోరాటంలో తీవ్రంగా దెబ్బతిన్న జాఫ్నా ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే. అంతేగాకుండా, ఇక్కడకు విచ్చేసిన రెండో విదేశీ నేత కూడా మోదీనే. ఇంతకుముందు, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ 2013లో జాఫ్నా వచ్చారు. ఇక్కడ తమిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎల్టీటీఈ పోరాటం సాగుతున్న కాలంలో ఇక్కడ టైగర్లకు గట్టి పట్టు ఉండేది.