: 150 అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేసిన తెలంగాణ సర్కారు


తెలంగాణ సర్కారు అశ్లీల వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 150 పోర్న్ వెబ్ సైట్లను గుర్తించి బ్లాక్ చేశామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఇతర అశ్లీల సైట్లను గుర్తించి బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు.

  • Loading...

More Telugu News