: మనవాళ్లు కూడా 'ఆరే'శారు!


వరల్డ్ కప్ లో గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆడిన 6 మ్యాచ్ లలోనూ ఓటమన్నది ఎరుగకుండా, నాకౌట్ దశలో అడుగుపెట్టింది. ఆక్లాండ్ లో శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 48.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ (138) సెంచరీతో అలరించాడు. అనంతరం, లక్ష్యఛేదనలో టీమిండియా 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 288 పరుగులు చేసి జయభేరి మోగించింది. 92 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రైనా, ధోనీ జోడీ ఆదుకుంది. రైనా (104 బంతుల్లో 110 నాటౌట్) అజేయ సెంచరీ చేయగా, ధోనీ (76 బంతుల్లో 85 నాటౌట్) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించడం విశేషం. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రైనాకు అందజేశారు.

  • Loading...

More Telugu News