: రైనా హాఫ్ సెంచరీ... జోరు పెంచిన టీమిండియా
జింబాబ్వేతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ గాడిలో పడింది. నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులో జతకలిసిన కెప్టెన్ ధోనీ(35), డ్యాషింగ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా(59)లు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. జట్టు స్కోరు సెంచరీ కాకముందే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా విజయావకాశాలపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే రైనాతో ధోనీ జతకలవడంతో పరిస్థితి మారిపోయింది. బౌండరీలతో విరుచుకుపడ్డ ఇద్దరూ వేగంగా పరుగులు చేశారు. రైనా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ధోనీ కూడా అర్ధ శతకానికి చేరువయ్యాడు. 38 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.