: సల్మాన్ ఖాన్ నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం: కత్రినా కైఫ్
నటుడు సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ అయినప్పటికీ కత్రినా కైఫ్ అతనికి స్నేహితురాలిగానే కొనసాగుతోంది. బాలీవుడ్ లో టాప్ కథానాయికగా కొనసాగుతున్నప్పటికీ తనను సినీతెరకు పరిచయంచేసి, ఓ స్థాయినిచ్చిన సల్మాన్ ను మాత్రం మరువలేదు. అందుకే ఆ ఏకైక సూపర్ స్టార్ లేకుండా తన సినీ ప్రయాణం, జీవితం లేవని చెబుతోంది. "సల్మాన్ అద్భుతమైన మానవత్వం ఉన్న వ్యక్తి. తను నా జీవితంలో, సినీ ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగం. సల్మాన్ వంటి వ్యక్తిని ప్రపంచంలో మనం కలవలేం. తన తల్లిదండ్రులు, చెల్లెళ్లు నాకు మంచి స్నేహితులు. వాళ్లు కూడా చాలా మంచివాళ్లు. నేనింతవరకు కలసిన వాళ్లలో వాళ్లు చాలా గౌరవప్రదమైన వ్యక్తులు" అని 'ఇండియా టుడే కంక్లేవ్-2015'లో తెలిపింది. ఇదే సమయంలో సల్మాన్ లోని పరోపకార గుణాన్ని, తను ఇతరులకు ఎలా సహాయం చేస్తాడన్న దానిపైన మాట్లాడింది. "ఎప్పుడైనా అకస్మాత్తుగా సల్మాన్ మీకు ఎదుటపడితే మాట్లాడేందుకు భయపడొద్దు. తను ప్రజల వ్యక్తి. వ్యక్తులతో తను చాలా జన్యూన్ గా సంభాషిస్తాడు" అంటూ కేట్ చెప్పుకొచ్చింది.