: కారును ఢీకొన్న ట్రాక్టర్... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి


తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. ఇటీవలే నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ తాను ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఇలాంటి దారుణ ఘటనే మరొకటి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాఘవేంద్రప్రసాద్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాదు నుంచి కర్నూలు జిల్లాలోని తన స్వస్థలానికి కారులో వెళుతుండగా ఓ ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రాఘవేంద్ర చనిపోగా... అతని భార్య లక్ష్మి, ఐదేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News