: లఖ్వీ విడుదల లేదు... మళ్లీ అదుపులోకి తీసుకున్న పాక్


2008 ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ ఈ రోజు విడుదల కావడంలేదు. పాకిస్థాన్ లోని పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో మళ్లీ లఖ్వీని పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో మరో నెల పాటు అతను జైల్లోనే ఉండనున్నాడు. లఖ్వీ నిర్బంధం అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు నిన్న(శుక్రవారం) ఆదేశించింది. ఈ క్రమంలో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కాక, పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కు సమన్లు పంపి వివరణ ఇవ్వాలని కోరిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News