: కోహ్లీ ఔట్... క్రీజులోకొచ్చిన ధోనీ... మరింత కష్టాల్లో ధోనీ సేన!


జింబాబ్వేతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. 17 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లను కూల్చిన జింబాబ్వే బౌలర్లు టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(38)ని కూడా పెవిలియన్ చేర్చారు. సికిందర్ రజా బౌలింగ్ లో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకొచ్చాడు. మరోవైపు 26వ ఓవర్ లో టీమిండియా స్కోరు సెంచరీ మార్కు దాటింది. డ్యాషింగ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా (18)తో కలిసి ధోనీ (4) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 27 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి ధోనీ సేన 104 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News