: పాక్ లో లఖ్వీ విడుదల పరిణామాలపై పర్యవేక్షిస్తున్నాం: అమెరికా


ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, తీవ్రవాది జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ విడుదల పరిణామాలపై పర్యవేక్షిస్తున్నామని అమెరికా పేర్కొంది. వైట్ హౌస్ లో రోజువారి జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో లఖ్వీ విషయంపై విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ముంబై తీవ్రవాద దాడుల ఘటనలో బాధితులకు న్యాయం చేసేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కొనసాగుతున్న న్యాయ విచారణ ప్రక్రియపై లఖ్వీ విడుదల ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు. లఖ్వీని నిర్బంధించడం అక్రమమన్న ఇస్లామాబాద్ కోర్టు వెంటనే విడుదల చేయాలని ఆదేశించగా, ఈరోజు విడుదలకానున్నాడు. మరోవైపు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News