: ఉస్మానియాలో వీధి కుక్కల స్వైర విహారం... పరుగులు పెట్టిన రోగులు
హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో నేటి ఉదయం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆస్పత్రిలోని రోగుల వార్డుల్లోకి చొరబడ్డాయి. దీంతో ఆస్పత్రి ఆవరణలో కలకలం రేగి, రోగులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న వైద్యాధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని అక్కడి కుక్కల సంఖ్యను చూసి నోరెళ్లబెట్టారు. అనంతరం తేరుకుని 50కి పైగా కుక్కలను పట్టుకుని బంధించారు.