: సుబ్రతా రాయ్ విడుదల కోసం సహారాకు ఇదే చివరి అవకాశం: సుప్రీం


సహారా గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ విడుదల కోసం సహారా సంస్థ జరిపే ఒప్పంద చర్చల కోసం సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. "దానికి సంబంధించి సీనియర్ న్యాయవాది దాఖలు చేసిన అభ్యర్థనకు మేము అంగీకరిస్తున్నాం. అంతేగాక ఆస్తుల అమ్మకానికి చర్చలకోసం మరో అవకాశం ఇస్తున్నాం" అని కోర్టు పేర్కొంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆస్తులు అమ్మి, కోర్టుకు రూ.10,000 కోట్లు చెల్లించగలిగితే సుబ్రతా విడుదలవుతారు. దాదాపు ఏడాది నుంచి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న సుబ్రతా రాయ్ విడుదల కోసం విదేశాల్లో ఉన్న కొన్ని ఆస్తులను అమ్మేందుకు సహారా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు కొనుగోలుదారులతో చర్చలు కూడా జరిపింది. ఓసారి జరిగిన ఒప్పందం మోసపూరితంగా ఉండటంతో ఆస్తుల అమ్మకం ఆగిపోయింది. దాంతో మూడవసారి, ఇదే చివరిసారి అంటూ ఉన్నత న్యాయస్థానం సహారాకు అవకాశం ఇచ్చింది.

  • Loading...

More Telugu News