: కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేస్తున్న జింబాబ్వే... రనౌటైన రెహానే
288 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు జింబాబ్వే ఎప్పటికప్పుడు బ్రేకులేస్తూనే ఉంది. జింబాబ్వే బౌలర్ తినాషే పన్యాంగర రెండు కీలక వికెట్లు పడగొట్టగా, రెట్టించిన ఉత్సాహంతో జింబాబ్వే ఫీల్డర్లు కట్టుదిట్టంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు రాబట్టేందుకు టీమిండియా బ్యాట్స్ మెన్ చెమటోడ్చాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మరో వికెట్ ను కోల్పోయింది. పరుగు సాధించే క్రమంలో రెహానే రనౌటయ్యాడు. దీంతో ధోనీ సేన స్వల్ప స్కోరుకే మూడో వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. 17 ఓవర్లు ముగిసేసరికి మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా 73 పరుగులు చేసింది.