: వెంకయ్యా... మీసాలు కత్తిరించుకో: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్య


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడిపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన దరిమిలా ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించిన వెంకయ్య, అందులో విఫలమయ్యారని నారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా నిన్న అనంతపురంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా మీసాలు కత్తించుకోవాలంటూ వెంకయ్యకు నారాయణ సూచించారు. ‘‘వెంకయ్యా..! మీసాలు కత్తిరించుకో. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు’’ అని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరతామని గతంలో వెంకయ్య మీసం మెలేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, నారాయణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అనంతలో ఆందోళనకు దిగి అరెస్టైన పార్టీ నేతలను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా నారాయణ, వెంకయ్యపై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News